Jairam Ramesh: మునుగోడులో గెలిచింది డబ్బు, మద్యం...

ABN , First Publish Date - 2022-11-07T15:02:41+05:30 IST

మునుగోడులో జరిగింది డబ్బు, మద్యం ఎన్నికలని, గెలిచింది మద్యం, మనీ అని, ప్రజాస్వామ్యాన్నీ కూని చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ అన్నారు.

Jairam Ramesh: మునుగోడులో గెలిచింది డబ్బు, మద్యం...

హైదరాబాద్: మునుగోడులో జరిగింది డబ్బు, మద్యం ఎన్నికలని, గెలిచింది మద్యం, మనీ అని, ప్రజాస్వామ్యాన్నీ కూని చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ అన్నారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ పాల్వాయి స్రవంతి గొప్ప ధైర్యం ఉన్న వ్యక్తి అని, ఇద్దరు కోటీశ్వరుల మధ్య స్రవంతి పోటీ చేశారన్నారు. ఉప ఎన్నిక నేపథ్యంలో మనుగోడు నియోజకవర్గంలో ప్రజలకు రూ. 200 కోట్ల మద్యం తాగించారని విమర్శించారు. భారత్ జోడో యాత్రకు, దీనికి సంబంధం లేదన్నారు. మునుగోడులో ఎం జరిగిందనేది సమీక్ష చేస్తామని జైరాం రమేష్ స్పష్టం చేశారు.

టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం కేవలం కాంగ్రెస్ పార్టీయేనని జైరాం రమేష్ అన్నారు. కొత్త ఉత్సాహంతో, కొత్త శక్తితో కాంగ్రెస్ దూసుకొస్తుందని, సాధారణ ఎన్నికలు అయితే స్రవంతి గెలిచేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అసాధారణ ఎన్నిక కాబట్టి గెలవలేదన్నారు. రాజగోపాల్ రెడ్డి ఓడిపోవడం తనకు సంతోషంగా ఉందన్నారు. చివరి 15 రోజులు ఎవరు ఎంత ఖర్చు పెట్టారో అందరికి తెలుసునని అన్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి షోకాజ్ నోటీస్ ఇచ్చామని, సమాధానం ఇస్తే ఏఐసీసీ చూసుకుంటుందన్నారు. పార్టీకి క్రమశిక్షణ ముఖ్యమని గీత దాటితే చర్యలు తప్పవని జైరాం రమేష్ పేర్కొన్నారు.

Updated Date - 2022-11-07T15:02:41+05:30 IST

Read more