అనుమానాస్పదస్థితిలో నవ వధువు ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-02-23T16:20:37+05:30 IST

రాజేంద్రనగర్‌ సర్కిల్‌ శివరాంపల్లిలో ఉంటున్న ఓ నవవధువు అనుమానాస్పదస్థితిలో ఆత్మహత్య చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి

అనుమానాస్పదస్థితిలో నవ వధువు ఆత్మహత్య

హైదరాబాద్/రాజేంద్రనగర్‌: రాజేంద్రనగర్‌ సర్కిల్‌ శివరాంపల్లిలో ఉంటున్న ఓ నవవధువు అనుమానాస్పదస్థితిలో ఆత్మహత్య చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబ్‌పేట్‌ మండలం కిష్టంపల్లి గ్రామానికి చెందిన రమే్‌ష (23)కు సంవత్సరం క్రితం అదే గ్రామానికి చెందిన రామకృష్ణ, సావిత్రి దంపతుల కుమార్తె వసంత (21)తో వివాహం జరిగింది. కట్నంగా లక్ష్మీగూడ రాజీవ్‌ గృహకల్పలోని ఇంటితో పాటు రెండున్నర తులాల బంగారం, ద్విచక్రవాహనం, ఇతర సామాగ్రి అందజేశారు. ప్రస్తుతం రమేష్‌ భార్యతో అందులోనే ఉంటున్నాడు. పెళ్లయిన ఆరు నెలల తర్వాత అదనపు కట్నం కావాలంటూ రమేశ్‌ భార్యను వేధించసాగాడు. ఆమెపై అభాండాలు మోపేవాడు. నెల రోజుల క్రితం కిష్టంపల్లి గ్రామ సర్పంచ్‌ శ్రీను దంపతులతో మాట్లాడి సర్ధిచెప్పారు.


ఇదిలా ఉండగా రెండు రోజుల క్రితం వసంత తండ్రికి ఫోన్‌ చేసి భర్త మళ్లీ వేధిస్తున్నాడని చెప్పింది. కుమారుడు సురేష్‌ను వెళ్లి చూసి రావాలని రామకృష్ణ చెప్పగా అతడు సోమవారం సాయంత్రం సోదరి ఇంటికి వచ్చాడు. లోపలి నుంచి గడియపెట్టి ఉండడంతో బాత్‌రూమ్‌ వెంటిలేటర్‌ నుంచి చూడగా వసంత ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. వెంటనే సురేశ్‌ తలుపులు బద్దలు కొట్టి సోదరిని కిందకు దింపి మైలార్‌దేవుపల్లిలోని ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. అప్పటికే వసంత మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. వసంత తండ్రి రామకృష్ణ ఫిర్యాదుతో మైలార్‌దేవుపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 


మా కుమార్తె మరణానికి అల్లుడే కారణం : రామకృష్ణ, 

మృతురాలి తండ్రి తమ కుమార్తె వసంత మరణానికి అల్లుడు రమేషే కారణం. కట్నం సరిపోలేదని, అదనంగా ఇవ్వాలని వసంతను రోజూ వేధించేవాడు. వసంతను రమేష్‌ హత్య చేసి ఫ్యానుకు వేలాడదీసి ఉంటాడని అనుమానం కలుగుతుంది. రమేష్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.     

రామకృష్ణ మృతురాలి తండ్రి  

Updated Date - 2022-02-23T16:20:37+05:30 IST