రాష్ట్రంలో 45.27 లక్షల టన్నుల ధాన్యం సేకరణ

ABN , First Publish Date - 2022-12-10T03:16:17+05:30 IST

వానాకాలం సీజన్‌కు సంబంధించి ఇప్పటివరకు 45.27 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యాన్ని అధికారులు సేకరించారు....

రాష్ట్రంలో 45.27 లక్షల టన్నుల ధాన్యం సేకరణ

హైదరాబాద్‌, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): వానాకాలం సీజన్‌కు సంబంధించి ఇప్పటివరకు 45.27 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యాన్ని అధికారులు సేకరించారు. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 6,938 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ జరుగుతుండగా.. ప్రస్తుతం 750 కొనుగోలు కేంద్రాలను మూసివేశారు. కాగా ఇప్పటివరకు 7,81,605 మంది రైతుల నుంచి రూ. 9,322 కోట్ల విలువైన 45.27 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. రైతులకు ఇప్పటివరకు రూ. 6,805 కోట్ల చెల్లింపులు చేయగా మరో రూ.2,517 కోట్లు చెల్లించాల్సి ఉంది.

Updated Date - 2022-12-10T03:16:18+05:30 IST