డిసెంబర్‌ 21 నుంచి సీఐటీయూ రాష్ట్ర మహాసభలు

ABN , First Publish Date - 2022-11-25T00:04:23+05:30 IST

డిసెంబర్‌ 21 నుంచి మూడు రోజుల పాటు జరుగనున్న సెంటర్‌ ఆఫ్‌ ఇండియన్‌ ట్రేడ్‌ యూనియన్స్‌ (సీఐటీయూ) తెలంగాణ రాష్ట్ర మహా సభలను విజయవంతం చేయడానికి సీఐటీయూకు అనుబంధంగా ఉన్న అన్ని సంఘాల నాయకులు కృషి చేయాలని సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్‌.వీరయ్య పిలుపునిచ్చారు.

డిసెంబర్‌ 21 నుంచి సీఐటీయూ రాష్ట్ర మహాసభలు

రాజేంద్రనగర్‌, నవంబర్‌ 24(ఆంధ్రజ్యోతి): డిసెంబర్‌ 21 నుంచి మూడు రోజుల పాటు జరుగనున్న సెంటర్‌ ఆఫ్‌ ఇండియన్‌ ట్రేడ్‌ యూనియన్స్‌ (సీఐటీయూ) తెలంగాణ రాష్ట్ర మహా సభలను విజయవంతం చేయడానికి సీఐటీయూకు అనుబంధంగా ఉన్న అన్ని సంఘాల నాయకులు కృషి చేయాలని సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్‌.వీరయ్య పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ కాటేదాన్‌లో గురువారం నిర్వహించిన రంగారెడ్డి జిల్లా సీఐటీయూ కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. దేశాన్ని, దేశ ఆర్థిక వ్యవస్థను ప్రధానమంత్రి నరేంద్రమోదీ బడా పెట్టుబడిదారులకు, కార్పొరేట్‌ శక్తులకు అప్పచెప్పే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో గడ్డురోజులు వస్తాయని ఇటీవల ఆమెజాన్‌ సంస్థ అధినేత చెప్పడాన్ని ఆయన గుర్తు చేశారు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా లెక్కల ప్రకారం ఉత్ప త్తి రేటు తగ్గుతోందన్నారు. నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయన్నారు. ప్రభుత్వ ఆస్థులు, స్థలాలు మార్కెట్లో అమ్మకానికి పెట్టి పెట్టుబడిదారులు దేశా న్ని దోచుకునేలా చేస్తున్నారన్నారు. 44 కార్మిక చట్టాలను మార్చి 4 కోడ్‌లుగా చేశారని, ఇది కార్మికలకు ద్రోహం చేసినట్టేనన్నారు. వీటిపై సీఐటీయూ నిరంతరం పోరాడుతోందన్నారు. కార్యక్రమంలో సీఐటీ యూ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి చంద్రమోహన్‌, అధ్యక్షుడు రాజు, కోశాధికారి జి.కవిత, రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు జె.రుద్రకుమార్‌, రవికుమార్‌, డి.కిషన్‌, సాయిబాబు, జిల్లా సహాయ కార్యదర్శులు స్వప్న, నర్సిరెడ్డి, దేవేందర్‌, ఎస్‌.రామ్మోహన్‌, జిల్లా కమిటీ సభ్యులు కృష్ణ, ఎల్లేశ్‌, జి.కురుమయ్య, సునీ త, భీమా, కార్యాలయ కార్యదర్శి ప్రేమాజీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-25T00:04:23+05:30 IST

Read more