రేపు చలో రాజ్‌భవన్‌

ABN , First Publish Date - 2022-11-24T23:29:27+05:30 IST

రాంనగర్‌, నవంబర్‌ 24 (ఆంధ్రజ్యోతి) : మోదీ ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని, అటవీ సంరక్షణ నియమాలు-2022ను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ రైతు, ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో 26న ఛలో రాజ్‌భవన్‌ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ఆదివాసీ అటవీ హక్కుల పరిరక్షణ సమన్వయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. విద్యానగర్‌ మార్క్స్‌భవన్‌లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో అఖిల భారత రైతుకూలీ సంఘ అధ్యక్షుడు వేములపల్లి వెంకట్రామయ్య, వివిధ సంఘాల ప్రతినిధులు టి.సాగర్‌, పశ్యపద్మ, కెచ్చెల రంగయ్య, అంజయ్యనాయక్‌, రాయలచంద్రశేఖర్‌, శ్రీరాంనాయక్‌, మండల వెంకన్న, ప్రసాద్‌, నత్తయ్య, బాలమల్లేష్‌ మాట్లాడారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని, స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారులను అమలు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. వ్యవసాయ రంగాన్ని కార్పొటీకరణ చేస్తున్నట్టుగానే అడవులు, భూగర్భ జలాలను దేశ, విదేశీసంస్థలకు ధారదత్తం చేయడానికి మోదీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. నూతన అటవీ చట్టంతో అడవుల వినాశం, పర్యావరణం, జీవ వాతావరణం నశిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. చలో రాజ్‌భవన్‌ను అందరూ విజయవంతం చేయాలని కోరారు.

రేపు చలో రాజ్‌భవన్‌
మాట్లాడుతున్న ఆదివాసీ అటవీ హక్కుల పరిరక్షణ సమన్వయ కమిటీ నేతలు సాగర్‌, పశ్యపద్మ, వేములపల్లి వెంకట్రామయ్య

Updated Date - 2022-11-24T23:29:27+05:30 IST

Read more