క్రీడలకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం

ABN , First Publish Date - 2022-12-12T00:50:11+05:30 IST

యువతలో క్రీడా స్ఫూర్తిని నింపేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు అందిస్తోందని బీజేపీ కూకట్‌పల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి మాధవరం కాంతారావు అన్నారు.

క్రీడలకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం

కూకట్‌పల్లి, డిసెంబర్‌ 11 (ఆంధ్రజ్యోతి): యువతలో క్రీడా స్ఫూర్తిని నింపేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు అందిస్తోందని బీజేపీ కూకట్‌పల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి మాధవరం కాంతారావు అన్నారు. కూకట్‌పల్లి స్వచ్ఛ భారత్‌ అభియాన్‌ ఆధ్వర్యంలో స్థానిక పీఎన్‌ఎం పాఠశాలలో ఆదివారం నిర్వహించిన వాలీబాల్‌ టోర్నమెంట్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం కాంతారావు మాట్లాడుతూ.. క్రీడల్లో రాణించే యువతకు మంచి భవిష్యత్‌ ఉంటుందని, ఫిట్‌ ఇండియా పేరుతో మోదీ చేపట్టే కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకొని ఈ పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పోటీల్లో గెలుపొందిన జట్లకు నగదు బహుమతులు అందజేస్తామని వివరించారు. కార్యక్రమంలో నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు, శ్రీకర్‌రావు, వినోద్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-12T00:50:11+05:30 IST

Read more