అప్పుల బాధతో బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-09-21T16:12:44+05:30 IST

సొంత అవసరాల కోసం చేసిన అప్పులతో మనస్తాపం చెందిన బీటెక్‌ విద్యార్థి సోమవారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పేట్‌బషీరాబాద్‌ పోలీసులు తెలిపిన వివరాల

అప్పుల బాధతో బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్/పేట్‌బషీరాబాద్‌: సొంత అవసరాల కోసం చేసిన అప్పులతో మనస్తాపం చెందిన బీటెక్‌ విద్యార్థి సోమవారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పేట్‌బషీరాబాద్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిర్మల్‌ జిల్లా కుంటాల గ్రామానికి చెందిన ఎం. నారాయణరావు కుమారుడు హర్షిత్‌(20). మేడ్చల్‌ జిల్లా, మైసమ్మగూడలోని శ్రీకాంత్‌రెడ్డి వసతి గృహంలో ఉంటూ మల్లారెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ 3వ సంవత్సరం చదువుతున్నాడు. ‘నేను చదువులో వెనుకబడుతున్నాను. దీనికి తోడు అప్పులు ఎక్కువయ్యాయి. ఎవరికీ చెప్పుకోలేకపోతున్నాను..’ అంటూ  తన సెల్‌ఫోన్‌లో సెల్ఫీ వీడియో తీసుకొని సోమవారం సాయంత్రం వసతి గృహంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పేట్‌బషీరాబాద్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Read more