సైకిల్‌ కొనివ్వలేదని బాలుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-03-23T16:38:48+05:30 IST

సైకిల్‌ కొనివ్వలేదని మనస్తాపానికి గురైన ఓ బాలుడు ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కామాటిపురా ఎస్‌ఐ సందీ్‌పరెడ్డి తెలిపిన

సైకిల్‌ కొనివ్వలేదని బాలుడి ఆత్మహత్య

హైదరాబాద్/మదీన: సైకిల్‌ కొనివ్వలేదని మనస్తాపానికి గురైన ఓ బాలుడు ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కామాటిపురా ఎస్‌ఐ సందీ్‌పరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఉస్మాన్‌బాగ్‌ బస్తీకి చెందిన జహంగీర్‌ కుమారుడు మహ్మద్‌ షాకీర్‌ (14) మదర్సాలో చదువుతున్నాడు. ఈనెల 21న సాయంత్రం 7 గంటల సమయంలో మదర్సా నుంచి ఫతేదర్వాజలోని సోదరుడి ఆఫీస్‌ వరకు నడుచుకుంటూ వచ్చాడు. సోదరున్ని సైకిల్‌ కొనివ్వాలని అడిగాడు. రేపు కొందామని చెప్పి షాకీర్‌ను ఇంటికి తీసుకెళ్లాడు. షాకీర్‌ తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నా డు. కుటుంబసభ్యులు ఎంత కొట్టినా తీయలేదు. బలవంతంగా తెరిచి చూసేసరికి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. కిందికి దించి  నిలోఫర్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. 

Read more