అసెంబ్లీ సెగ్మెంట్లకు బీజేపీ పాలక్‌లు

ABN , First Publish Date - 2022-12-30T03:13:59+05:30 IST

రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు బీజేపీ పాలక్‌లను నియమించింది.

అసెంబ్లీ సెగ్మెంట్లకు బీజేపీ పాలక్‌లు

లక్ష్మణ్‌-మేడ్చల్‌, కిషన్‌రెడ్డి-శేరిలింగంపల్లి, డీకే అరుణ-కుత్బుల్లాపూర్‌

హైదరాబాద్‌, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు బీజేపీ పాలక్‌లను నియమించింది. స్థానికేతర ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలతో పాటు సీనియర్‌ నేతలకు (సొంత జిల్లా కూడా కాదు) ఈ బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు గురువారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వారి పేర్లను ప్రకటించారు. రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌ (మేడ్చల్‌), కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి (శేరిలింగంపల్లి), డీకే అరుణ (కుత్బుల్లాపూర్‌), ధర్మపురి అర్వింద్‌ (మెదక్‌), ఈటల రాజేందర్‌ (వరంగల్‌ ఈస్ట్‌), సోయం బాపురావు (ములుగు), వివేక్‌ (జుక్కల్‌), ఎం. రఘునందన్‌రావు (ఎల్లారెడ్డి), పి. మురళీధర్‌రావు (పటాన్‌చెరు), మర్రి శశిధర్‌రెడ్డి (రాజేంద్రనగర్‌), ఏపీ జితేందర్‌రెడ్డి (చేవెళ్ల), విజయశాంతి (పరిగి), కొండా విశ్వేశ్వర్‌రెడ్డి (జుబ్లీహిల్స్‌), ఎన్‌. ఇంద్రసేనారెడ్డి (కంటోన్మెంట్‌), కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (మహబూబ్‌నగర్‌), ఎన్‌.రాంచందర్‌రావు (కల్వకుర్తి), గరికపాటి మోహన్‌రావు (నల్లగొండ), చాడ సురేశ్‌రెడ్డి (మునుగోడు), డాక్టర్‌ ఎ. చంద్రశేఖర్‌ (నకిరేకల్‌), బూర నర్సయ్యగౌడ్‌ (పాలకుర్తి), మాజీ డీజీపీ డాక్టర్‌ కృష్ణప్రసాద్‌ (భూపాలపల్లి), కపిలవాయి దిలీప్‌కుమార్‌ (నాగార్జునసాగర్‌), చందుపట్ల కీర్తిరెడ్డి(కరీంనగర్‌) జాబితాలో ఉన్నారు. పాలక్‌లు ప్రతీనెలలో 3 రోజుల పాటు తమకు కేటాయించిన అసెంబ్లీ సెగ్మెంటులో పూర్తిస్థాయి సమయం కేటాయించాల్సి ఉంటుంది.

Updated Date - 2022-12-30T03:14:00+05:30 IST