Etela Comments: తెలంగాణలో పాదయాత్రలకు పర్మిషన్ ఇవ్వకపోవడంపై ఈటల ఏమన్నారంటే...

ABN , First Publish Date - 2022-11-30T14:03:39+05:30 IST

తెలంగాణలో పాదయాత్రలకు పర్మిషన్ ఇవ్వకపోవడంపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు.

Etela Comments: తెలంగాణలో పాదయాత్రలకు పర్మిషన్ ఇవ్వకపోవడంపై ఈటల ఏమన్నారంటే...

హైదరాబాద్: తెలంగాణలో పాదయాత్రలకు పర్మిషన్ ఇవ్వకపోవడంపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (BJP MLA Etela Rajender) స్పందించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ...వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల (YSRTP Chief YS Sharmila)పై పోలీసులు వ్యవరించిన తీరు సరిగా లేదన్నారు. కేసీఆర్ (CM KCR) చేస్తోన్న వ్యవహారం తప్పని చెప్పుకొచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి ఇట్లా చేస్తే తెలంగాణ ఉద్యమం నడిచేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం (KCR Government)లో అరాచకం జరుగుతుందని విమర్శించారు. పోలీసులు కూడా దుర్మార్గంగా వ్యవస్తున్నారన్నారు. కేసీఆర్ కేసు పెట్టమంటేనే పోలీసులు కేసు పెడుతారని తెలిపారు. ప్రజలపై అరాచకం జరుగుతుందని మండిపడ్డారు. ప్రజలు తిరగపడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఈటల రాజేందర్ (BJP) హెచ్చరించారు.

Updated Date - 2022-11-30T14:03:39+05:30 IST

Read more