Ramachandrarao: బీఆర్ఎస్ గుర్తింపు పొందలేదు

ABN , First Publish Date - 2022-12-10T13:32:47+05:30 IST

బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు స్పందించారు.

Ramachandrarao: బీఆర్ఎస్ గుర్తింపు పొందలేదు

న్యూఢిల్లీ: బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు (BJP MLC Ramachandra rao) స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ సమస్యలు, ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి బీఆర్ఎస్ పెట్టారని అన్నారు. కేసీఆర్ (Telangana CM KCR) ముందు రైతు రుణమాఫీ చేసి ఇచ్చిన హామీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అబ్ కి బార్ బి మెరా పరివార్ కా సర్కార్ కావాలని కేసీఆర్ కోరుకుంటున్నారని విమర్శించారు. రైతుల కోసం కాదు.. తన పరివారం కోసమే బీఆర్ఎస్ పెట్టారని వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌కు తన కుటుంబానికి ఉన్న ఆకాంక్షల కోసం బీఆర్ఎస్ పెట్టారన్నారు. తెలంగాణలో శాంతి భద్రతలు లేవని.. అత్యాచారాలు, కిడ్నాప్‌లు జరుగుతున్నాయని అన్నారు. తెలంగాణలో ఏ గుణాత్మక మార్పు వచ్చిందో చెప్పాలని అడిగారు. కేంద్ర పథకాలు కేసీఆర్ ప్రజలకు చేరువకానీయడం లేదని మండిపడ్డారు. టీఆర్ఎస్‌కు వీఆర్ఎస్ ఇస్తారనే భయంతో బీఆర్ఎస్ తీసుకువచ్చారని బీజేపీ నేత యెద్దేవా చేశారు.

కేసీఆర్ కలలు కలలుగానే ఉంటాయని.. బీఆర్ఎస్ గుర్తింపు పొందలేదన్నారు. రైతులు బీజేపీ వెంట ఉన్నారని.. రైతు సమస్యలను బీజేపీ పరిష్కరిస్తుందని తెలిపారు. జాతీయ పార్టీ పెట్టడానికి ఎవరికి అభ్యంతరం లేదని... ఎవరికైనా పార్టీ పెట్టుకునే అధికారం ఉందన్నారు. ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీగా మారేకన్న ముందే టీఆర్ఎస్ అవినీతి జాతీయ స్థాయికి చేరిపోయిందని వ్యాఖ్యలు చేశారు. ప్రాంతీయ పార్టీలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందలేవని తెలిపారు. ఆప్‌కి జాతీయ పార్టీగా గుర్తింపు రావడానికి 12 ఏళ్ళ సమయం పట్టిందని రామచంద్రరావు పేర్కొన్నారు.

Updated Date - 2022-12-10T13:32:48+05:30 IST