Laxman: విమోచన దినోత్సవాన్ని నిర్వహించకుంటే ప్రజలు క్షమించరు

ABN , First Publish Date - 2022-09-03T19:53:17+05:30 IST

విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకుంటే తెలంగాణ సర్కార్‌ను, టీఆర్ఎస్ పార్టీని ప్రజలు క్షమించరని బీజేపీ జాతీయ నేత లక్ష్మణ్ అన్నారు.

Laxman: విమోచన దినోత్సవాన్ని నిర్వహించకుంటే ప్రజలు క్షమించరు

హైదరాబాద్: విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకుంటే తెలంగాణ సర్కార్‌ (Telangana government)ను, టీఆర్ఎస్ పార్టీ (TRS)ని ప్రజలు క్షమించరని బీజేపీ జాతీయ నేత లక్ష్మణ్(Laxman) అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17ను పరేడ్ గ్రౌండ్స్‌లో  కేంద్రం అధికారికంగా విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తోందని తెలిపారు. కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amith shah) ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. తెలంగాణ, కర్ణాటక, మహరాష్ట్ర ముఖ్యమంత్రలను కూడా అహ్వానిస్తున్నామని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) హాజరవుతారా లేదా అనేది ఆయన విజ్ఞత అని తెలిపారు. ఎంఐఎం (MIM) ఒత్తిడితోనే విమోచన దినోత్సవాన్ని కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి పరిమితం చేశారన్నారు. ఎనిమిదేళ్ళుగా సెప్టెంబర్ 17ను ఎందుకు నిర్వహించటం లేదో కేసీఆర్ తెలంగాణ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ తీరు వలన అమరుల కుటుంబాలు క్షోబిస్తున్నాయని లక్ష్మణ్ అన్నారు. 

Updated Date - 2022-09-03T19:53:17+05:30 IST