BJP - TDP alliance: బీజేపీ, టీడీపీ పొత్తుపై లక్ష్మణ్ ఏమన్నారంటే...

ABN , First Publish Date - 2022-09-01T19:37:21+05:30 IST

బీజేపీ, టీడీపీ పొత్తుపై గత కొద్దిరోజులుగా వస్తున్న వార్తలపై బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

BJP - TDP alliance: బీజేపీ, టీడీపీ పొత్తుపై లక్ష్మణ్ ఏమన్నారంటే...

హైదరాబాద్: బీజేపీ, టీడీపీ పొత్తు (BJP - TDP alliance)పై గత కొద్దిరోజులుగా వస్తున్న వార్తలపై బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు లక్ష్మణ్ (Laxman) స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... టీడీపీ (TDP)తో పొత్తు అంశం వార్తలకే పరిమితమని స్పష్టం చేశారు. తెలంగాణ (Telangana)లో  బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఆంద్రప్రదేశ్‌లో పవన్ కళ్యాణ్‌ (Pawan kalyan)తో కలసి పోటీ చేస్తుందని ప్రకటించారు. ఆంద్రప్రదేశ్‌ రాష్ట్రంలో రోజురోజుకు బీజేపీ పెరుగుతోందన్నారు. బీజేపీ, టీడీపీ పొత్తుపై ఎలాంటి చర్చలు కూడా జరగడం లేదని లక్ష్మణ్ (BJP MP) తేల్చి చెప్పారు. 

Updated Date - 2022-09-01T19:37:21+05:30 IST