మాట ఇస్తే.. మాట తప్పని నేత YSR: Bhatti

ABN , First Publish Date - 2022-07-08T17:01:13+05:30 IST

మాట ఇస్తే.. మాట తప్పని నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని తెలంగాణ సీఎల్సీ నేత భట్టి విక్రమార్క అన్నారు.

మాట ఇస్తే.. మాట తప్పని నేత YSR: Bhatti

హైదరాబాద్ (Hyderabad): మాట ఇస్తే.. మాట తప్పని నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి (Rajasekhar Reddy) అని తెలంగాణ సీఎల్సీ నేత భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. శుక్రవారం వైఎస్ జయంతి సందర్భంగా పంజాగుట్టలోని వైఎస్ విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ చూపిన మార్గంలో తెలంగాణ కాంగ్రెస్ ముందుకు వెళ్తోందని, కష్టపడి పనిచేస్తున్నామన్నామని అన్నారు. వైఎస్ఆర్ హాయంలో అప్పటి ఏపీ అభివృద్ధి సంక్షేమంలో దేశంలోనే ముందుందన్నారు. నిరు పేదలకు ఇళ్ళు, రాజీవ్ ఆరోగ్య శ్రీ ఇచ్చిన మహా నాయకుడు వైఎస్ అని కొనియాడారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, జలయజ్ఞాన్ని ప్రస్తుత పాలకులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. వైఎస్ కట్టిన ప్రాజక్ట్‌ల వలనే వ్యవసాయానికి నీళ్ళు అందుతున్నాయన్నారు. రైతుల‌ కోసం ఉచిత కరెంటు గురించి మొదట ఆలోచన చేసి.. అమలు చేసింది వైఎస్ఆర్ అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

Read more