TS News: వెంకట్‌రెడ్డితో కాంగ్రెస్‌కు అంతరంగిక సమస్యలు: భట్టి

ABN , First Publish Date - 2022-08-07T19:24:27+05:30 IST

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కాంగ్రెస్‌కు అంతరంగిక సమస్యలున్నాయని భట్టి విక్రమార్క అన్నారు.

TS News: వెంకట్‌రెడ్డితో కాంగ్రెస్‌కు అంతరంగిక సమస్యలు: భట్టి

హైదరాబాద్ (Hyderabad): ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) ఆధ్వర్యంలో జరుగుతున్న నీతి ఆయోగ్‌ (Niti Aayog) సమావేశానికి సీఎం కేసీఆర్ (CM KCR) హాజరుకాకపోవడం ఆయన ఇష్టమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Venkat Reddy)తో కాంగ్రెస్‌ (Congress)కు అంతరంగిక సమస్యలున్నాయని, వాటిని పార్టీ పరంగానే పరిష్కరించుకుంటామని స్పష్టం చేశారు. పాలనపై అవగాహన లేకుండా బీజేపీ (BJP) పథకాలు చేస్తోందని విమర్శించారు. పీసీసీ ఎప్పుడూ మౌనంగా ఉండదని.. సరైన సమయంలో చర్యలు తీసుకుంటుందన్నారు. మునుగోడు కాంగ్రెస్‌కు కంచుకోటని, గతంలో కంటే కాంగ్రెస్‌ అత్యధిక మెజార్టీతో గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీలో విభేధాలపై సీనియర్లతో మాట్లాడుతానని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

Read more