సోనియాతో బతుకమ్మ ఎత్తించిన ఘనత మాదే

ABN , First Publish Date - 2022-11-30T03:40:20+05:30 IST

సీఎం కేసీఆర్‌ కుటుంబంపై ట్విటర్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు....

సోనియాతో బతుకమ్మ ఎత్తించిన ఘనత మాదే

నాటి తెలంగాణ ఉద్యమంలో ముందున్నది మేమే

నాడు కాంగ్రెస్‌ పార్టీ, రేవంత్‌ రెడ్డి ఎక్కడ?

రేవంత్‌ ట్వీట్‌పై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం

హైదరాబాద్‌, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): సీఎం కేసీఆర్‌ కుటుంబంపై ట్విటర్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తొత్తుగా ఉంటూ ఉద్యమకారులపై తుపాకి ఎక్కుపెట్టిన వారు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో మహిళల పాత్రను కేవలం పప్పన్నం, బోనం, బతుకమ్మలకు పరిమితం చేస్తూ మాట్లాడడం మహిళల పట్ల కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న గౌరవాన్ని తెలియజేస్తున్నదని ధ్వజమెత్తారు. మహిళలు, బతుకమ్మ, బోనాలను కించపర్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా, ప్రియాంకలచే బతుకమ్మలను ఎత్తించినా, బతుకమ్మ పేరును ఉచ్ఛరించేలా చేసినా.. అది తెలంగాణ ఆడబిడ్డల ఘనతేనని మంగళవారం ట్వీట్‌ చేశారు. తెలంగాణ ఉద్యమంలో నిర్వహించిన మిలియన్‌ మార్చ్‌, సాగర హారం, అసెంబ్లీ ముట్టడిలో ఆడబిడ్డలమైన తాము ముందున్నామని, కానీ కాంగ్రెస్‌ పార్టీ, రేవంత్‌ రెడ్డి ఎక్కడున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ కాలయాపన చేయడం వల్లే వేలాది మంది ప్రాణాలు వదిలారని అన్నారు.

Updated Date - 2022-11-30T03:40:20+05:30 IST

Read more