Bandi Sanjay: హిందూ దేవుళ్ళను కించపర్చే విధంగా మాట్లాడితే ఉరికించి కొడుతాం..
ABN , First Publish Date - 2022-12-31T15:36:49+05:30 IST
హైదరాబాద్: హిందూ దేవుళ్ళను కించపరిచే విధంగా మాట్లాడితే ఉరికించి కొడుతామని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.

హైదరాబాద్ (Hyderabad): హిందూ దేవుళ్ళను కించపరిచే విధంగా మాట్లాడితే ఉరికించి కొడుతామని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ హిందువులపై పీడీ యాక్ట్
లు పెడుతారని, హిందూ దేవుళ్ళను కించపరిచిన వాళ్ళపై మాత్రం చర్యలు ఉండవని అన్నారు. ముఖ్యమంత్రి కొడుకు కేటీఆర్ (KTR) నాస్తికుడని, దేవుళ్ళు అంటే నమ్మకం ఉండదని అన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) అయితే నిజమైన హిందువునని చెబుతారని అన్నారు. బైరి నరేష్ (Bairi Naresh) హిందువులను అవమానపరిచే విధంగా మాట్లాడితే మంత్రి హరీష్ రావు (Harishrao సమర్థిస్తున్నారని.. సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని బండి సంజయ్ మండిపడ్డారు.
కాగా అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ అరెస్ట్ అయ్యారు. శనివారం వరంగల్‌లో పోలీసులకు పట్టుబడ్డారు. అయ్యప్పస్వామిపై బైరి నరేష్ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో అయ్యప్పస్వాములతో పాటు పలువురు తీవ్ర కోపోద్రిక్తులయ్యారు. నడిరోడ్డుపై బైరి నరేష్ అనుచరుడు శంకర్‌పై దాడి చేశారు. నరేష్ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా అయ్యప్ప భక్తుల ధర్నాలకు దిగారు. బైరి నరేష్‌పై పలు చోట్ల కేసులు సైతం నమోదయ్యాయి. దీంతో అతనిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి బైరి నరేష్ కోసం గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు శనివారం ఉదయం వరంగల్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు.
Read more