మూడు వారాల్లో మూడు ఉత్సవాలు

ABN , First Publish Date - 2022-07-05T17:12:33+05:30 IST

పది రోజులుగా బీజేపీ బహిరంగ సభకు భారీ కసరత్తు చేసిన పోలీసులు సభ ప్రశాంతంగా ముగియడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈనెల 10న బక్రీద్‌, 17న సింద్రాబాద్‌ మహంకాళి

మూడు వారాల్లో మూడు ఉత్సవాలు

బక్రీద్‌, మహంకాళి, లాల్‌దర్వాజ బోనాల

బందోబస్తుకు పోలీసుల సమాయత్తం

హైదరాబాద్‌ సిటీ: పది రోజులుగా బీజేపీ బహిరంగ సభకు భారీ కసరత్తు చేసిన పోలీసులు సభ ప్రశాంతంగా ముగియడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈనెల 10న బక్రీద్‌, 17న సింద్రాబాద్‌ మహంకాళి బోనాలు, 24న లాల్‌దర్వాజ బోనాలు జరగనున్నాయి. దీంతో ఆయా కార్యక్రమాల పోలీసులు బందోబస్తుకు సిద్ధమవుతున్నారు. బక్రీద్‌ సందర్భంగా ఈనెల 10న ముస్లింల సామూహిక ప్రార్థనల నేపథ్యంలో ఈద్గాలు, మసీదుల వద్ద ఏర్పాట్లు, తీసుకోవాల్సిన చర్యలపై మత పెద్దలతో చర్చిస్తున్నారు. భద్రతా పరంగా ఎలాంటి సమస్యలూ రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. బోనాల ఏర్పాట్లలో కూడా నిమగ్నమయ్యారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించబోమని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. నకిలీ వీడియోలు వైరల్‌ చేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సమస్యలుంటే డయల్‌ 100లో సంప్రదించాలని కోరుతున్నారు. 

Read more