బక్క పలుచని వీరుడు.. బందూకయ్యాడు

ABN , First Publish Date - 2022-11-30T03:57:23+05:30 IST

మీ పోరాటం అనితర సాధ్యం.. అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.

బక్క పలుచని వీరుడు.. బందూకయ్యాడు

కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ కేటీఆర్‌ ట్వీట్‌

హైదరాబాద్‌, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): ‘మీ పోరాటం అనితర సాధ్యం.. అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. 29 నవంబరు 2009న ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజును టీఆర్‌ఎస్‌ దీక్షా దివ్‌సగా జరుపుతోంది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మంగళవారం కేసీఆర్‌ దీక్ష సందర్భంనాటి చిత్రాన్ని ట్విటర్‌లో పోస్టు చేశారు. మీ పోరాటం అనితర సాధ్యం.. ఒక నవ శకానికి నాంది పలికిన రోజు.. ఒక బక్కపలుచని వీరుడు బందూకై తన జాతిని మేలుకొలిపిన రోజు.. తెలంగాణ వైపు దేశం దృష్టి మరల్చే విధంగా తెగించిన రోజు.. చరిత్రను మలుపుతిప్పిన రోజు.. 29నవంబరు 2009 తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయమైన రోజు.. అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రశంసించారు.

Updated Date - 2022-11-30T03:57:23+05:30 IST

Read more