తెలంగాణాలో బాబా టెక్స్‌టైల్ మెషినరీ మొదటి శాఖ

ABN , First Publish Date - 2022-10-11T05:30:00+05:30 IST

కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ యంత్రాల తయారీదారులు, దిగుమతిదారులలో ఒకటైన బాబా టెక్స్‌టైల్ మెషినరీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సోమాజిగూడ రాజ్ భవన్ రోడ్‌లో..

తెలంగాణాలో బాబా టెక్స్‌టైల్ మెషినరీ మొదటి శాఖ

హైదరాబాద్: కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ యంత్రాల తయారీదారులు, దిగుమతిదారులలో ఒకటైన బాబా టెక్స్‌టైల్ మెషినరీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సోమాజిగూడ రాజ్ భవన్ రోడ్‌లో తన కొత్త శాఖ కార్యాలయాన్ని ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్రంలో ఇది బాబా సంస్థ మొట్ట‌మొద‌టి శాఖ‌. ఈ కొత్త కార్యాలయం సంస్థ మరియు వినియోగ‌దారుల మధ్య కీలకమైన బంధాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తుందని.. ఈ కొత్త సదుపాయం కార‌ణంగా అవ‌కాశాల‌ను మెరుగుపరచడమే కాకుండా నెట్‌వర్కింగ్ మరియు సహకారానికి మరిన్ని అవకాశాలను అందిస్తుందని అన్నారు బాబా టెక్స్‌టైల్ మెషినరీ బిజినెస్ హెడ్ కేశవ్ అగర్వాల్.


ఇంకా ఆయన మాట్లాడుతూ “తెలంగాణ రాష్ట్రం ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు, వ్యాపారాభివృద్దికి ఎంతో అనుకూల‌మైన ప్రాంతం.. ఈ కార‌ణంగానే తెలంగాణ రాష్ట్రంలో మొట్ట‌మొద‌టి శాఖ‌ను ప్రారంభించాం. త‌ద్వారా ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు మా ఉత్ప‌త్తుల‌ను మ‌రింత చేరువ చేస్తాం. మా కస్టమర్‌లు మరియు డీలర్‌ల కోసం సానుకూల మార్పును తీసుకురావడానికి సాంకేతికంగా ఉన్నతమైన పరికరాలను అందించడమే మా ప్రయత్న‌ం. రాష్ట్రంలో ఇది తొలిస్టోర్ కాగా.. దేశంలో ఇది ఎనిమిదో స్టోర్’’ అని తెలిపారు. బాబా టెక్స్‌టైల్ మెషినరీ బిజినెస్ హెడ్ ముకుంద్ అగర్వాల్ మాట్లాడుతూ.. మా వద్ద అన్ని రకాల సాంకేతికతలు అందుబాటులో ఉన్నాయి, అయితే రోబోటిక్ ఆర్మ్ టెక్నిక్‌తో కూడిన ఆటోమేటెడ్ బాబిన్ మెషీన్‌ల వంటి కొత్త టెక్నాలజీలను పరిచయం చేయడంలో మేము జాగ్రత్తలు తీసుకుంటున్నామ‌న్నారు. అవసరం లేని యంత్రాల‌ను ఏర్పాటు చేసి అన‌వ‌స‌ర‌పు ఖ‌ర్చును నివారించాల్సిన అవ‌స‌రం ఉంది. ఈ దిశ‌గా త‌మ ఆలోచ‌న‌లు ఎప్పుడూ ముందుకు సాగుతాయ‌న్నారు.

Read more