వామపక్ష నేతల అరెస్టులు శోచనీయం: తమ్మినేని

ABN , First Publish Date - 2022-11-19T02:54:11+05:30 IST

మునుగోడులో బీజేపీ ఓడిపోయినప్పటికీ రాష్ట్రంలో దాని ప్రమాదం పొంచే ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.

వామపక్ష నేతల అరెస్టులు శోచనీయం: తమ్మినేని

హైదరాబాద్‌, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): మునుగోడులో బీజేపీ ఓడిపోయినప్పటికీ రాష్ట్రంలో దాని ప్రమాదం పొంచే ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు శుక్రవారం ఎంబీ భవన్‌లో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు విజయ రాఘవన్‌, బీవీ రాఘవులుతో కలిసి మాట్లాడారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న వామపక్షాల నేతలను అరెస్టు, గృహ నిర్బంధం చేయటం శోచనీయమన్నారు.

Updated Date - 2022-11-19T02:54:11+05:30 IST

Read more