మళ్లీ.. బదిలీ

ABN , First Publish Date - 2022-02-23T18:11:07+05:30 IST

ఇటీవల బదిలీల్లో భాగంగా కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌ నుంచి ఆల్వాల్‌ సర్కిల్‌కు బదిలీ అయిన ఓ సూపరింటెండెంట్‌ ఓ ఉన్నతాధికారి సిఫార్సుతో అలా వెళ్లి

మళ్లీ.. బదిలీ

సూపరింటెండెంట్‌ మళ్లీ అక్కడికే..

హైదరాబాద్/కుత్బుల్లాపూర్‌: ఇటీవల బదిలీల్లో భాగంగా కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌ నుంచి ఆల్వాల్‌ సర్కిల్‌కు బదిలీ అయిన ఓ సూపరింటెండెంట్‌ ఓ ఉన్నతాధికారి సిఫార్సుతో అలా వెళ్లి ఇలా వెనక్కు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సదరు విషయాన్ని తెలుపుతూ ‘ఇందో వింత సర్కిల్‌’ అనే శీర్షికన ఈ నెల 19న ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన ఉన్నతాధికారులు వెంటనే సదరు సూపరింటెండెంట్‌ను మళ్లీ కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌ నుంచి ఆల్వాల్‌ సర్కిల్‌కు బదిలీ చేశారు. అతడి స్థానంలో బదిలీపై వెళ్లిన శ్రీనివాస్‌ యాదవ్‌ను అల్వాల్‌ సర్కిల్‌ నుంచి కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌కు మరోసారి బదిలీ చేశారు.  కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌ కార్యాలయంలో అసలు ఏం జరుగుతుంది.? ఎవరెవరికీ ఏఏ విధులు కేటాయించారు.? ఎవరేం చేస్తున్నారు..? అనే పూర్తి వివరాలను అందించాల్సిందిగా డీసీకి ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు వినికిడి. 

Read more