బస్వరాజుకు అంబేడ్కర్‌ స్ఫూర్తి పురస్కారం

ABN , First Publish Date - 2022-11-30T00:40:53+05:30 IST

25 ఏండ్లుగా సామాజిక సేవ చేస్తున్న పద్మారావునగర్‌లోని అప్సా స్వచ్ఛంద సంస్థ కో-ఆర్డినేటర్‌ బస్వరాజ్‌ డాక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌ రాజ్యాంగ స్ఫూర్తి పురస్కారం- 2022 అందుకున్నారు.

బస్వరాజుకు అంబేడ్కర్‌ స్ఫూర్తి పురస్కారం

పద్మారావునగర్‌, నవంబర్‌ 29 (ఆంధ్రజ్యోతి): 25 ఏండ్లుగా సామాజిక సేవ చేస్తున్న పద్మారావునగర్‌లోని అప్సా స్వచ్ఛంద సంస్థ కో-ఆర్డినేటర్‌ బస్వరాజ్‌ డాక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌ రాజ్యాంగ స్ఫూర్తి పురస్కారం- 2022 అందుకున్నారు. మంగళవారం రవీంద్ర భారతి సెమినార్‌ హాల్లో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవం సదస్సులో తెలంగాణ ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ, టీఎ్‌సపీఎ్‌ససీ మాజీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణి, టీఎ్‌సఎంఎ్‌సఐసీడీసీ చైర్మన్‌ డాక్టర్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి కలిసి బస్వరాజ్‌కు పురస్కారం అందజేసి అభినందనలు తెలిపారు.

Updated Date - 2022-11-30T00:40:53+05:30 IST

Read more