Geeta Arts: నటి బోయ సునీత మళ్లీ నిరసన

ABN , First Publish Date - 2022-11-18T10:54:22+05:30 IST

నటి బోయ సునీత జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌-45లోని గీతా ఆర్ట్స్‌ కార్యాలయం ఎదుట దుస్తులు Geeta Arts Office

Geeta Arts: నటి బోయ సునీత మళ్లీ నిరసన

హైదరాబాద్/బంజారాహిల్స్‌: నటి బోయ సునీత జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌-45లోని గీతా ఆర్ట్స్‌ కార్యాలయం ఎదుట దుస్తులు విప్పి ఆందోళన చేపట్టారు. సినీ నిర్మాత బన్నీ వాసు తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఆరోపిస్తూ గతంలో ఆమె పలుమార్లు నిరసన వ్యక్తం చేసి హల్‌చల్‌ చేశారు. నెల రోజుల క్రితం కూడా గీతా ఆర్ట్స్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేసేందుకు వచ్చిన సునీతను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆమె మతిస్థిమితం సరిగా లేదని భావించి ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయానికి తరలించారు. సునీత గురువారం రాత్రి మరోసారి గీతా ఆర్ట్స్‌ కార్యాలయం ఎదుట దుస్తులు తీసేసి కూర్చొని, న్యాయం చేయాలని నిరసన తెలిపారు. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్‌ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2022-11-18T11:24:33+05:30 IST