ఈ నెల 18న రామకృష్ణ మఠం క్విజ్ కాంపిటీషన్‌.. భారీగా నగదు బహుమతులు

ABN , First Publish Date - 2022-09-14T03:06:04+05:30 IST

హైదరాబాద్: దేశం ఆజాదీ కా అమృతోత్సవాలు జరుపుకుంటోన్న వేళ రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో కొనసాగుతోన్న ఆర్యజనని కార్యక్రమం ద్వారా సెప్టెంబర్ 18న క్విజ్ కాంపిటీషన్ నిర్వహించనున్నారు.

ఈ నెల 18న రామకృష్ణ మఠం క్విజ్ కాంపిటీషన్‌.. భారీగా నగదు బహుమతులు

హైదరాబాద్: దేశం ఆజాదీ కా అమృతోత్సవాలు జరుపుకుంటోన్న వేళ రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో కొనసాగుతోన్న ఆర్యజనని కార్యక్రమం ద్వారా సెప్టెంబర్ 18న క్విజ్ కాంపిటీషన్ నిర్వహించనున్నారు. ది గ్రేట్ ఇండియన్ సివిలైజేషన్ కాంటెస్ట్ పేరుతో నిర్వహిస్తోన్న ఈ కాంపిటీషన్‌ కోసం కొలంబో టు అల్మోరా అనే పుస్తకాన్ని ఎంపిక చేశారు. స్వామి వివేకానంద చేసిన ప్రసంగాలు ఈ పుస్తకంలో ఉంటాయి. 


సెప్టెంబర్ 18న కాంపిటీషన్ ముగిశాక ఫలితాలను సెప్టెంబర్ 30న వెల్లడిస్తారు. 18 నుంచి 30 ఏళ్ల వయసు మధ్య ఉన్న యువత దీనికి అర్హులు. 


మొదటి బహుమతి 2 లక్షల రూపాయలు కాగా, రెండో బహుమతి కింద లక్షన్నర, మూడో బహుమతిగా లక్ష రూపాయల నగదు బహుమతి అందిస్తారు. అంతేకాకుండా మరో 97 మందికి పాతిక వేల రూపాయల క్యాష్ ప్రైజులిస్తారు. మొత్తం 150 మంది విజేతలకు వెయ్యి రూపాయల విలువైన  సాహిత్యాన్ని అందజేస్తారు. 


రిజిస్టర్ చేసుకునేందుకు www.aaryajananicontest.org అనే వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని నిర్వాహకులు తెలిపారు. లేదా  https://forms.gle/krTtXQyveEgpkGw86 ను సందర్శించవచ్చని నిర్వాహకులు సూచించారు.

Read more