ఆస్తి కోసం అన్నను చంపిన తమ్ముడు

ABN , First Publish Date - 2022-12-13T03:09:08+05:30 IST

ఆస్తి కోసం ఓ తమ్ముడు సొంత అన్నను అత్యంత దారుణంగా చంపేశాడు.

ఆస్తి కోసం అన్నను చంపిన తమ్ముడు

మరో ఇద్దరితో కలిసి గడ్డపారతో దాడి

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

రంగారెడ్డి జిల్లా తుర్కగూడలో ఘటన

ఇబ్రహీంపట్నం, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ఆస్తి కోసం ఓ తమ్ముడు సొంత అన్నను అత్యంత దారుణంగా చంపేశాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్‌ స్టేషన్‌ పరిధి తుర్కగూడలో జరిగింది. గ్రామానికి చెందిన కందాల నర్సింహారెడ్డి(48)కి ముగ్గురు సోదరులున్నారు. వీరు తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తి సమంగా పంచుకున్నారు. కాగా, మరో 15 గుంటల భూమిని నర్సింహారెడ్డి ఇతరుల నుంచి కొనుగోలు చేశాడు. ఈ భూమిపై కన్నేసిన తమ్ముడు జనార్ధన్‌రెడ్డి తనకూ అందులో వాటా కావాలంటూ తరచూ అన్నతో గొడవపడుతున్నాడు. ఈ నెల 3న అన్న పొలానికి అడ్డంగా జనార్ధన్‌రెడ్డి కడీరాళ్లను పాతుతుండగా అన్న నర్సింహారెడ్డి అడ్డుపడ్డాడు. దీంతో జనార్ధన్‌రెడ్డి.. సామ జంగారెడ్డి, పండాల శ్రీకాంత్‌గౌడ్‌లతో కలిసి నర్సింహారెడ్డిపై గడ్డపారతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన నర్సింహారెడ్డిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. కాగా, దాడికి పాల్పడ్డ జనార్ధన్‌రెడ్డి, జంగారెడ్డి, శ్రీకాంత్‌గౌడ్‌లను పోలీసులు ఇప్పటికే రిమాండ్‌కు తరలించారు.

Updated Date - 2022-12-13T03:09:08+05:30 IST

Read more