కేబుల్‌ బ్రిడ్జిపై నుంచి దూకి యువతి ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2022-11-30T00:23:02+05:30 IST

మాదాపూర్‌ దుర్గంచెరువు కేబుల్‌ బ్రిడ్జి పైనుంచి దూకి ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

కేబుల్‌ బ్రిడ్జిపై నుంచి దూకి యువతి ఆత్మహత్యాయత్నం

మాదాపూర్‌, నవంబర్‌ 29 (ఆంధ్రజ్యోతి): మాదాపూర్‌ దుర్గంచెరువు కేబుల్‌ బ్రిడ్జి పైనుంచి దూకి ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే స్పందించిన లేక్‌ పోలీసులు ఆమెను కాపాడారు. మెహిదీపట్నం రేతిబౌలిలోని సప్తగిరి కాలనీకి చెందిన ఆడారి హర్షిత(19) జ్ఞాన దీపిక కళాశాలలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతోంది. మంగళవారం సాయంత్రం 6గంటల సమయంలో కేబుల్‌ బ్రిడ్జిపై నుంచి చెరువులోకి దూకింది. సమీపంలో పెట్రోలింగ్‌ చేస్తున్న కానిస్టేబుల్‌ గమనించి లేక్‌ పోలీసులను అప్రమత్తం చేశాడు. ఎస్‌ఐ భానుప్రకాశ్‌ వెంటనే బోటు డ్రైవర్‌ మనోహర్‌తో కలిసి ఆమె దూకిన చోట గాలించి రక్షించారు. చికిత్స నిమిత్తం ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.

Updated Date - 2022-11-30T00:23:02+05:30 IST

Read more