ఆ అధికారిపై అంత ప్రేమేందుకో..!

ABN , First Publish Date - 2022-10-03T17:09:26+05:30 IST

ఆయన రవాణా శాఖలో ఓ ఉన్నతాధికారి. సుమారు 12ఏళ్ల క్రితం సర్వీ్‌సలోకి వచ్చిన ఆయన ఎక్కడికి బదిలీ అయినా, మళ్లీ సౌత్‌ జోన్‌కే వస్తున్నారు. సిబ్బంది లేనిప్రాంతానికి బదిలీ చేసినా,

ఆ అధికారిపై అంత ప్రేమేందుకో..!

హైదరాబాద్‌ సిటీ: ఆయన రవాణా శాఖలో ఓ ఉన్నతాధికారి. సుమారు 12ఏళ్ల క్రితం సర్వీ్‌సలోకి వచ్చిన ఆయన ఎక్కడికి బదిలీ అయినా, మళ్లీ సౌత్‌ జోన్‌కే వస్తున్నారు.  సిబ్బంది లేనిప్రాంతానికి బదిలీ చేసినా, మళ్లీ పాత స్థానానికే పంపిస్తున్నారు.  ఇటీవల బదిలీపై వెళ్లిన సదరు అధికారి మళ్లీ సౌత్‌ జోన్‌కే రావడంపై ఎంపీ అసదుద్దీన్‌తోపాటు మలక్‌పేట ఎమ్మెల్యే బలాలా స్వయాన రవాణాశాఖ జాయింట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌కు లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. సదరు అధికారి పోస్టింగ్‌ తీసుకున్న కొత్తల్లో తొలుత ఈస్ట్‌జోన్‌లో కొన్నేళ్ల పాటు విధులు నిర్వహించారు. అక్కడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఐదేళ్ల క్రితం బదిలీపై సౌత్‌జోన్‌ కార్యాలయానికి వచ్చారు. ఏళ్లుగా ఇక్కడే పాగా వేసిన సదరు అధికారిని ఎనిమిది నెలల క్రితం బదిలీ చేశారు. ఆయన తిరిగి అదే కార్యాలయానికి వచ్చేశారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే, ఎంపీ లేఖలో ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే రాసిన లేఖ అందిందని జేటీసీ పాండురంగ నాయక్‌ వివరించారు.

Read more