రంగధాముని చెరువుపై చిరువ్యాపారులకు స్థలం

ABN , First Publish Date - 2022-11-19T01:01:38+05:30 IST

కూకట్‌పల్లిలోని రంగధాముని చెరువు(ఐడీఎల్‌)ను సుందరంగా తీర్చిదిద్ధి ప్రజలకు అందుబాటులోకి తీసుకురాబోతున్నామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.

రంగధాముని చెరువుపై చిరువ్యాపారులకు స్థలం

  • ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

కూకట్‌పల్లి, నవంబర్‌ 18 (ఆంధ్రజ్యోతి): కూకట్‌పల్లిలోని రంగధాముని చెరువు(ఐడీఎల్‌)ను సుందరంగా తీర్చిదిద్ధి ప్రజలకు అందుబాటులోకి తీసుకురాబోతున్నామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత చిరువ్యాపారులకు శాశ్వత ప్రతిపాదికన స్థలం కేటాయించేలా చర్యలు తీసుకొంటామని హామీ ఇచ్చారు. దీంతో వ్యాపారులు హర్షం వ్యక్తం చేశారు. చెరువు కట్టపై జరుగుతున్న పనులను శుక్రవారం ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. మొదటి విడతగా రూ.18కోట్లతో చెరువు అభివృద్ధి పనులను చేపట్టినట్లు తెలిపారు. దీనిని మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చబోతున్నామన్నారు. అభివృద్ధి పనులు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఈ సందర్భం గా అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ పగుడాల శిరీష, అధికారులు ఆనంద్‌, నర్సింగ్‌రావు, నాయకులు బాబురావు, శ్రావణ్‌కుమార్‌, ప్రభాకర్‌గౌడ్‌, వెంకటే్‌షచౌదరి, అంబటి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-19T01:01:46+05:30 IST

Read more