జీవీకే వద్ద 3డీ వంతెన

ABN , First Publish Date - 2022-09-25T16:48:14+05:30 IST

గ్రేటర్‌లో అధునాతన సదుపాయాలతో కూడిన పాదచారుల వంతెన అందుబాటులోకి రానుంది. ఇప్పటి వరకు నిర్మించిన/పురోగతిలో ఉన్న

జీవీకే వద్ద 3డీ వంతెన

 పాదచారుల కోసం నిర్మాణం

 రూ.5 కోట్లతో ప్రతిపాదన


హైదరాబాద్‌ సిటీ: గ్రేటర్‌లో అధునాతన సదుపాయాలతో కూడిన పాదచారుల వంతెన అందుబాటులోకి రానుంది. ఇప్పటి వరకు నిర్మించిన/పురోగతిలో ఉన్న వంతెనలకు భిన్నంగా ఆధునిక సదుపాయాలతో బంజారాహిల్స్‌లో 3డీ ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ కసరత్తు మొదలు పెట్టింది. జీవీకే మాల్‌ వద్ద రూ.5 కోట్లతో ఈ వంతెన నిర్మాణాన్ని ప్రతిపాదించారు. రెండు వైపులా ఎస్కలేటర్లు, పది మంది చొప్పున ఏకకాలంలో వెళ్లే సామర్థ్యంతో  కూడిన రెండు లిఫ్టులు, సీసీ కెమెరాలు, ఫుట్‌పాత్‌ అంచున సీలింగ్‌, క్లాడింగ్‌ వంటి సదుపాయాలతో ఎంఎస్‌ స్టీల్‌తో వంతెన నిర్మించనున్నారు. వ్యాపార, వాణిజ్య సముదాయాలు, విద్యాసంస్థలు ఉన్న ప్రధాన రహదారులపై పాదచారులు రోడ్డు దాటేందుకు ఇబ్బంది పడుతోన్న 43 ప్రాంతాల్లో ఎఫ్‌ఓబీల నిర్మాణం చేపట్టారు. ఇందులో 21 వంతెనలు అందుబాటులోకి వచ్చాయని జీహెచ్‌ఎంసీ వర్గాలు పేర్కొన్నాయి. నాలుగు చోట్ల పనులు వివిధ కారణాలతో ప్రారంభం కాలేదు. మిగతా ఏరియాల్లో పనులు పురోగతిలో ఉన్నాయి.

Read more