Hyderabadలో వెలుగులోకి వచ్చిన CI బాగోతం

ABN , First Publish Date - 2022-07-09T18:49:02+05:30 IST

నగరంలో మారేడ్‌పల్లి సీఐ నాగేశ్వరరావు బాగోతం వెలుగులోకి వచ్చింది.

Hyderabadలో వెలుగులోకి వచ్చిన CI బాగోతం

హైదరాబాద్: నగరంలో మారేడ్‌పల్లి సీఐ (CI) నాగేశ్వరరావు బాగోతం వెలుగులోకి వచ్చింది. ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వనస్థలిపురంలోని ఓ లాడ్జిలో సీఐ దొరికిపోయాడు.  ఇటీవల బంజారాహిల్స్ డ్రగ్స్ కేసులో సీఐ కీలకంగా వ్యవహరించారు. అయితే వనస్థలిపురం పోలీస్స్టేషన్ పరిధిలో ఓ లాడ్జిలో మహిళతో ఉంటూ సీఐ అడ్డంగా బుక్కైయ్యారు. వెంటనే నాగేశ్వరరావును వనస్థలిపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళ భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐపై అత్యాచారయత్నం యాక్ట్ కింద కేసు నమోదు అయ్యింది. 


Updated Date - 2022-07-09T18:49:02+05:30 IST