Hyderabad: ఆటో డ్రైవర్లపై ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ వేధింపులు

ABN , First Publish Date - 2022-09-29T13:26:28+05:30 IST

ట్రాఫిక్‌ నిబంధనల పేరు తో ఆటో డ్రైవర్లను మలక్‌పేట ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ చలాన్లపేరుతో వేధింపులకు గురిచేస్తుండడంతో ఫిర్యాదు

Hyderabad: ఆటో డ్రైవర్లపై ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ వేధింపులు

హోం మంత్రిని కలిసేందుకు వచ్చి వెనుతిరిగిన డ్రైవర్లు..

హైదరాబాద్/చాదర్‌ఘాట్‌: ట్రాఫిక్‌ నిబంధనల పేరు తో ఆటో డ్రైవర్లను మలక్‌పేట ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ చలాన్లపేరుతో వేధింపులకు గురిచేస్తుండడంతో ఫిర్యాదు చేసేందుకు ఆజంపురలోని హోంమంత్రి మహ మూద్‌అలీ నివాసానికి బుధవారం బారులు తీరారు. విషయం తెలియక చాద ర్‌ఘాట్‌ పోలీసులు ఒక్కమారుగా ఉలికిపడ్డారు. హోం మంత్రి నివాసానికి ఒక్కమారుగా ఇంతమంది ఆటో డ్రైవర్లు ఎందుకు వచ్చారో తెలుసుకునేందు కు హుటాహుటిన చేరుకున్నారు. హోంమంత్రి అందుబాటులో లేకపోవడంతో ఆటో డ్రైవర్లు చేసేది లేక కొద్ది సేపు అక్కడే ఉండిపోయారు. పోలీసులు హోం మంత్రి నివాసానికి వచ్చిన ఆటో డ్రైవర్లకు నచ్చజెప్పి తరలించారు. 

Updated Date - 2022-09-29T13:26:28+05:30 IST