నేటి నుంచి హైదరాబాద్‌ లిటరరీ ఫెస్ట్‌

ABN , First Publish Date - 2022-01-28T12:55:26+05:30 IST

సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే హైదరాబాద్‌ లిటరరీ ఫెస్ట్‌ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. కొవిడ్‌ వ్యాప్తి

నేటి నుంచి హైదరాబాద్‌ లిటరరీ ఫెస్ట్‌

హైదరాబాద్‌ సిటీ: సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే హైదరాబాద్‌ లిటరరీ ఫెస్ట్‌ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. కొవిడ్‌ వ్యాప్తి దృష్యా ఈ కార్యక్రమాన్ని ఆన్‌లైన్‌ వేదికగా నిర్వహించనున్నట్లు ఫెస్టివల్‌ డైరెక్టర్‌ కిన్నెర మూర్తి తెలిపారు. ఈ ఫెస్ట్‌ జనవ రి 28 నుంచి 30 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. బ్రిటీష్‌ కౌన్సిల్‌ ఆర్ట్స్‌ ఇండియా డైరెక్టర్‌ జొనాథన్‌ కెన్నడీ, ఐటీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయే్‌షరంజన్‌లు సాయంత్రం 5.30 గంటలకు ఫెస్ట్‌ను ప్రారంభించనున్నారని తెలిపారు. పూర్తిగా ఆన్‌లైన్‌లో నిర్వహించే లిటరరీ ఫెస్ట్‌లో ప్యానెల్‌ డిస్కషన్స్‌, చలనచిత్రాలు, వర్క్‌షాప్‌, క్విజ్‌, ఎగ్జిబిషన్స్‌ ఏర్పాటు చేయనున్నట్లు కిన్నెర మూర్తి తెలిపారు.

Read more