హైదరాబాద్‌.. వెలిగిపోతోంది!

ABN , First Publish Date - 2022-08-16T08:48:27+05:30 IST

నాసా వ్యోమగామి రాజాచారి.. భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా అరుదైన చిత్రాన్ని ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

హైదరాబాద్‌.. వెలిగిపోతోంది!

హైదరాబాద్‌, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): నాసా వ్యోమగామి రాజాచారి.. భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా అరుదైన చిత్రాన్ని ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. హైదరాబాద్‌ మూలాలు కలిగిన రాజాచారి, తాను అంతరిక్షంలో ఉన్నప్పుడు తీసిన ఆ ఫొటోను సోమవారం ట్విటర్‌లో ఉంచారు. ‘అదిగదిగో హైదరాబాద్‌.. ప్రకాశిస్తోంది’ అంటూ అంతరిక్షం నుంచి తీసిన నగర ఫొటోను పోస్ట్‌ చేశారు. అమెరికాకు వలస వచ్చిన తన తండ్రి స్వస్థలం హైదరాబాద్‌.. అంటూ నగరంతో తనకున్న అనుబంధాన్ని తెలియజేశారు. రాజాచారి ట్వీట్‌కు నెటిజన్ల నుంచి విశేష స్పందన లభించింది. మంత్రి కేటీఆర్‌ ఈ చిత్రాన్ని రీట్వీట్‌ చేశారు. 1999లో యూఎస్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ నుంచి గ్రాడ్యుయేట్‌ పట్టా పొందిన రాజాచారి.. ఫైటర్‌ జెట్‌ పైలట్‌గా చేరారు. 2017 నుంచి నాసా వ్యోమగామిగా ఉన్నారు. ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌ మిషన్‌లో భాగంగా చారి 177 రోజుల పాటు అంతరిక్షంలో విజయవంతంగా గడిపి తిరిగివచ్చారు. 

Read more