Hyderabad: పోలీసుల తనిఖీలు.. రూ.1.24 కోట్ల వాహలా డబ్బు గుర్తింపు

ABN , First Publish Date - 2022-09-30T03:45:58+05:30 IST

కోటి 24 లక్షల రూపాయల హవాలా డబ్బును పోలీసులు పట్టుకున్నారు. యూపీ మీరట్‌కి చెందిన షోయబ్ మాలిక్‌...

Hyderabad: పోలీసుల తనిఖీలు.. రూ.1.24 కోట్ల వాహలా డబ్బు గుర్తింపు

హైదరాబాద్ (Hyderabad): కోటి 24 లక్షల రూపాయల హవాలా డబ్బును పోలీసులు పట్టుకున్నారు. యూపీ మీరట్‌కి చెందిన షోయబ్ మాలిక్‌ (Shoib Malik) డబ్బుగా  గుర్తించారు. షోయబ్ ఏడు నెలల క్రితం హైదరాబాద్ వచ్చి పాత సామాను వ్యాపారం చేస్తున్నారు. యూపీలోని తన బంధువు కామిల్ సూచించడంతో గుజరాత్ (Gujarat) గల్లీకి చెందిన భరత్ వద్ద  షోయబ్ రూ.1.24 కోట్లు తీసుకున్నారు. సమాచారం తెలుసుకున్న టాస్క్‌ఫోర్స్ (Task Force) పోలీసులు .. షోయబ్ నివాసంలో తనిఖీలు చేశారు. నగదుకు సంబంధించి లెక్క చెప్పకపోవడంతో హవాలా మార్గంలో డబ్బులు తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. రూ.1.24 కోట్లను ఆదాయపన్ను అధికారులకు అప్పగించారు. 


Read more