డ్రగ్స్ కేసుల్లో అరెస్ట్ అయినా తీరుమారని హైదరాబాద్ వ్యాపారవేత్తలు

ABN , First Publish Date - 2022-05-24T19:37:44+05:30 IST

డ్రగ్స్ కేసుల్లో అరెస్డైనా హైదరాబాద్ వ్యాపారవేత్తల తీరు మారడం లేదు. గతంలో పంజాగుట్ట కేసులో అరెస్డైన నిందితుడు పాన్ మసాల ఓనర్ యజ్ఞానంద..

డ్రగ్స్ కేసుల్లో అరెస్ట్ అయినా తీరుమారని హైదరాబాద్ వ్యాపారవేత్తలు

హైదరాబాద్ : డ్రగ్స్ కేసుల్లో అరెస్ట్ అయినా హైదరాబాద్ వ్యాపారవేత్తల తీరు మారడం లేదు. గతంలో పంజాగుట్ట కేసులో అరెస్ట్ అయిన నిందితుడు పాన్ మసాల ఓనర్ యజ్ఞానంద మరోసారి దూల్ పేట‌లో డ్రగ్స్ కొనుగోలుకు ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తోంది. తన డ్రైవర్ లియాకత్‌ను ఇచ్చి డ్రగ్స్ తీసుకురమ్మని యజ్ఞానంద చెప్పినట్టు సమాచారం. నైజీరియన్ వద్ద డ్రగ్స్ తీసుకుంటూ యజ్ఞానంద డ్రైవర్ దొరికిపోయాడు. తన యజమాని కోసమే డ్రగ్స్ కొనుగోలు చేయడానికి వచ్చానని డ్రైవర్ తెలిపాడు. సన్ సిటీలో డ్రగ్స్‌తో పట్డబడ్డ డ్రైవర్ లియాకత్ అరెస్డ్ డ్రగ్స్ కొనుగోలు చేయడానికి ప్రయత్నించిన ఏపీ ప్రొడక్డ్ యజమాని యజ్ఞానంద పరారీలో ఉన్నాడు. పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు.

Read more