హైదరాబాద్ యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్ వద్ద ఉద్రిక్తత

ABN , First Publish Date - 2022-02-24T00:41:16+05:30 IST

యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీస్ బెటాలియన్ గ్రౌండ్ వద్ద భీమ్లా నాయక్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్‎కు..

హైదరాబాద్ యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్ వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్: యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీస్ బెటాలియన్ గ్రౌండ్ వద్ద భీమ్లా నాయక్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్‎కు భారీగా అభిమానులు తరలి‌వస్తున్నారు. బారికేడ్లు తన్నేసి అభిమానులు ఈవెంట్ లోపలికి వెళ్తున్నారు. దీంతో అభిమానులను పోలీసులు కంట్రోల్ చేయలేకపోతున్నారు. అభిమానులను తరిమేస్తున్నారు. పోలీసులకు, అభిమానులకు మధ్య తొక్కిసలాట జరిగింది. దీంతో పోలీసులు స్వల్పంగా లాఠీఛార్జ్ చేశారు. అనుమతి లేకుండా ఈవెంట్‌కు వచ్చిన అభిమానులు.. వేదిక వద్దకు అనుమతించడంలేదు. యూసుఫ్‎గూడ బయట పరిసరాల్లోనూ అభిమానుల కోలాహలం నెలకొంది. 


మరోవైపు ‘భీమ్లానాయక్’ మూవీ ఫ్రీ రిలీజ్ వేడుక జరుగుతోంది. చిత్రయూనిట్‌తో పాటు పవన్ కల్యాణ్ సహా మంత్రి కేటీఆర్ కూడా హాజరవుతున్నారు. అటు లిమిట్ ప్రకారమే పాసులు జారీ చేశారు.  అయితే ఏపీ, తెలంగాణ నుంచి అభిమానులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఎలాగైనా సరే లోపలికి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 
Read more