హాస్టల్‌ విద్యార్థులతో గ్యాస్‌ బండలు మోయించిన వార్డెన్

ABN , First Publish Date - 2022-03-16T12:33:09+05:30 IST

అభం శుభం తెలియని చిన్నారు లు వారు... ఆటలపాటలతో చదువుకుంటూ కాలం గడిపేవారు. ఎలాంటి భారాలు లేకుండా గడిచిపోయే

హాస్టల్‌ విద్యార్థులతో గ్యాస్‌ బండలు మోయించిన వార్డెన్

ఖమ్మం: అభం శుభం తెలియని చిన్నారు లు వారు... ఆటలపాటలతో చదువుకుంటూ కాలం గడిపేవారు. ఎలాంటి భారాలు లేకుండా గడిచిపోయే బాల్యం వారిది. అటు వంటి చిన్నారులతో హస్టల్‌ అధికారులు మోయలేని భారాలు మోపిస్తున్నారు. ఇల్లెందు పట్టణంలోని ఎస్టీ బాలుర హస్టల్‌ వి ద్యార్ధులతో మంగళవారం హాస్టల్‌ వార్డెన్‌ గ్యాస్‌ బండలు మో యించారు. హాస్టల్‌ కమ్‌ పాఠశాలగా సాగుతున్న ఎస్టీ బాలుర హస్టల్‌లో 1 నుంచి 7వతరగతి వరకు విద్యాభ్యాసం సాగు తోంది. కానీ హస్టల్‌లో అన్ని రకాల పనులను సంబంధిత అధి కారులు మాత్రం తమతో చేయిస్తుంటారని విద్యార్ధులు పేర్కొం టున్నారు. హాస్టల్‌లో సరిపడా సిబ్బంది ఉన్నప్పటీకీ కేవలం విద్యార్ధులతో పనులు చేయించడంపై విద్యార్ధి సంఘాలు భగ్గు మంటున్నాయి. వార్డెన్‌పై చర్య తీసుకోవాలని కోరుతున్నాయి. 

Read more