మిద్దె పై కూరగాయల సాగుపై ఒక రోజు శిక్షణా కార్యక్రకమం

ABN , First Publish Date - 2022-02-24T02:03:52+05:30 IST

మిదె్దపైనా, బాల్కనీలో కూరగాయల సాగు చేసుకోవాలని ఆసక్తి వున్న వారికి ఒక రోజు శిక్షణా కార్యక్రకమం నిర్వహించనున్నట్టు తెలంగాణ ఉద్యాన వన శాఖ డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.

మిద్దె పై కూరగాయల సాగుపై ఒక రోజు శిక్షణా కార్యక్రకమం


హైదరాబాద్: మిదె్దపైనా, బాల్కనీలో కూరగాయల సాగు చేసుకోవాలని ఆసక్తి వున్న వారికి ఒక రోజు శిక్షణా కార్యక్రకమం నిర్వహించనున్నట్టు తెలంగాణ ఉద్యాన వన శాఖ డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 27వ తేదీ ఆదివారం ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు మిద్దెపైన కూరగాయలు, పండ్లు, పూల సాగుపై శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. మిద్దెపైన, బాల్కనీ, వర్టికల్ పైప్ లలో కూరగాయలు, పండ్లు, పూల సాగు పై ప్రాధమిక అంశాలతో పాటు, సేంద్రదీయ పద్దతిలో ఎలా సాగుచేయడం,చీడ పీడల నివారణ మార్గాల గురించి సునిశితంగా అవగాహన కల్పిస్తామన్నారు.


ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మిద్దెపై కూరగాయల సాగు పై అంతర్గత చర్చ కూడా ఉంటుందన్నారు. ఆసక్తి గల వారు తమ పేర్లను నమోదుచేసుకోవాలని కోరారు. దీని కోసం 9705384384 నెంబర్ కు వాట్సాప్ మెసేజ్ పంపాలి. మొదటి 70 మందికి మాత్రమే ఈ అవకాశం వుంటుందని నిర్వాహకులు తెలిపారు. 

Read more