మద్యం మత్తులో స్టీరింగ్‌ పట్టి.. ఇద్దరిని బలిగొని..

ABN , First Publish Date - 2022-03-16T08:52:20+05:30 IST

మద్యం మత్తులో ఉన్న వ్యక్తి స్టీరింగ్‌ తీసుకోవడం ప్రమాదానికి దారితీసి, గర్భిణి సహా ఇద్దరి ప్రాణాలను బలిగొంది.

మద్యం మత్తులో స్టీరింగ్‌ పట్టి.. ఇద్దరిని బలిగొని..

మరో ఘటనలో బైక్‌ను ఢీకొట్టి బోల్తాకొట్టిన వ్యాన్‌.. తండ్రీ, కొడుకు దుర్మరణం

కరకగూడెం/వేంసూరు, మార్చి 15: మద్యం మత్తులో ఉన్న వ్యక్తి స్టీరింగ్‌ తీసుకోవడం ప్రమాదానికి దారితీసి, గర్భిణి సహా ఇద్దరి ప్రాణాలను బలిగొంది. మరో ఘటనలో బైక్‌ను వ్యాన్‌ ఢీకొట్టడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న తండ్రికొడుకులిద్దరూ దుర్మరణం పాలయ్యారు. ఇలా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంగళవారం జరిగిన ప్రమాదాల్లో నలుగురు మృతిచెందారు. 24 మంది గాయపడ్డారు. గుండాల మండలం చినవెంకటాపురానికి చెందిన కల్తీ కృష్ణారావు తన కొడుకు పుట్టు వెంట్రుకల మొక్కు తీర్చేందుకు సోమవారం ఓ వ్యాన్‌లో రెక్కల రామక్క అమ్మవారి దర్శనానికి వెళ్లారు. వాహనంలో కుటుంబసభ్యులు, బంధువులు కలిసి 40మంది ఉన్నా రు. తిరుగుప్రయాణంలో మద్యం మత్తులో ఉన్న మరో డ్రైవర్‌, తాను నడుపుతానని డ్రైవింగ్‌ సీట్లో కూర్చుని వాహనాన్ని నడిపాడు. కరకగూడెం మండలం మద్యలగూడెం వద్ద వాహనం అదుపుతప్పి గోతి లో పడింది. ఈ ఘటనలో చిన వెంకటాపురానికి చెందిన సమ్మక్క (50), ములుగు జిల్లా వీరాపురానికి చెందిన గర్భిణి స్వర్ణలత (30) మృతి చెందారు. 21 మంది గాయపడ్డారు. కాగా, ఖమ్మం జిల్లా వేం సూరు మండలం రాయుడుపాలెం-మర్లపాడు మధ్య వ్యాన్‌, ఓ బైక్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. బైక్‌పై వెళుతున్న కుంచపర్తికి చెందిన మద్దిరెడ్డి కృష్ణయ్య (70), కుమారుడు శ్రీనివాసరెడ్డి (50) మృతి చెందారు.  

Updated Date - 2022-03-16T08:52:20+05:30 IST