వజ్రోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు

ABN , First Publish Date - 2022-09-13T05:32:08+05:30 IST

వజ్రోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు

వజ్రోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు

  ఆర్ట్స్‌ కళాశాల, హయగ్రీవాచారి గ్రౌండ్‌లను పరిశీలించిన కలెక్టర్‌ 

హనుమకొండ రూరల్‌, సెప్టెంబరు 12: తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని  కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు  అధికారులను ఆదేశించారు. సోమవారం నగరపాలక సంస్థ కమిషనర్‌ ప్రావీణ్య, అదనపు కలెక్టర్‌ సంధ్యారాణితో కలిసి ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ గ్రౌండ్‌, హయగ్రీవాచారి మైదానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ... ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు మూడు రోజులుపాటు జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవాలన్నారు. ప్రతీ ఒక్కరికి జాతీయ జెండాలు అందించేందుకు వలంటీర్లను నియమించాలని సూచించారు. పోలీస్‌, రెవెన్యూ, జిల్లా అధికారులు, మేధావులు, విద్యార్థులు, ప్రజలందరూ వేడుకల్లో భాగస్వాములు అయ్యే విధంగా చూడాలని తెలిపారు. పరకాల నియోజకవర్గంలో కూడా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. తాగునీరు, శానిటేషన్‌, రవాణా సౌకర్యం, భోజన కౌంటర్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. వైద్య, ఫైర్‌ సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌వో వాసుచంద్ర, నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌ రషీద్‌, ఎస్‌ఈ ప్రవీణ్‌చంద్ర, ఈఈలు సంజయ్‌, రవికుమార్‌, డీఆర్‌డీవో శ్రీనివా్‌సకుమార్‌, జిల్లా మైనారిటీ అధికారి మేన శ్రీను, డీపీవో జగదీష్‌, మెప్మా పీడీ భద్రునాయక్‌, ఎంహెచ్‌వో జ్ఞానేశ్వర్‌, తహసీల్దార్‌ జి.రాజ్‌కుమార్‌, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

 

Updated Date - 2022-09-13T05:32:08+05:30 IST