వివరణ ఇవ్వకపోతే వ్యక్తిగతంగా హాజరుకావాలి

ABN , First Publish Date - 2022-06-12T08:50:37+05:30 IST

వివరణ ఇవ్వకపోతే వ్యక్తిగతంగా హాజరుకావాలి

వివరణ ఇవ్వకపోతే వ్యక్తిగతంగా హాజరుకావాలి

హుస్సేన్‌ సాగర్‌ పరిధిలోని ఆక్రమణలపై జీహెచ్‌ఎంసీ, 

హెచ్‌ఎండీఏ కమిషనర్లకు హైకోర్టు ఆదేశాలు 


హైదరాబాద్‌, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): హుస్సేన్‌సాగర్‌ ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌ (ఎఫ్‌టీఎల్‌)లో అక్రమ నిర్మాణాలపై వివరణ ఇవ్వాలని జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ కమిషనర్లకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. 6 వారాల్లో వివరణ సమర్పించకపోతే కమిషనర్లు వ్యక్తిగతంగా హాజరుకావాలని పేర్కొంది. హుస్సేన్‌సాగర్‌ పరిధిలో అక్రమంగా నిర్మాణాలతో పాటు తారు రోడ్లు, ఇతర వాణిజ్య కార్యకలాపాలు చేపడుతున్నారని డాక్టర్‌ లుబ్నా సావత్‌ 2020లో హైకోర్టుకు లేఖరాశారు. దీనిని హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించింది. చీఫ్‌ జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్‌ అభినందన్‌కుమార్‌ షావిలి ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. రెండేళ్లయినా కౌంటర్లు సమర్పించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 

Read more