తిరుమలేశుడి సేవలో హైకోర్టు న్యాయమూర్తి

ABN , First Publish Date - 2022-09-19T08:59:03+05:30 IST

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డి. నాగార్జున ఆదివారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.

తిరుమలేశుడి సేవలో హైకోర్టు న్యాయమూర్తి

తిరుమల, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డి. నాగార్జున ఆదివారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో ఆలయంలోకి వెళ్లిన ఆయన ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత గర్భాలయంలోని మూలమూర్తిని దర్శించుకున్నారు. ఈమేరకు రంగనాయక మండపంలో న్యాయమూర్తికి వేదపండితులు ఆశీర్వచనం చేయగా, అధికారులు లడ్డూప్రసాదాలు అందజేశారు. 

Read more