High alert: మావోయిస్టు వారోత్సవాలు... ఏజెన్సీలో హైఅలర్ట్

ABN , First Publish Date - 2022-09-23T15:32:57+05:30 IST

మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో ఏజెన్సీలో హైఅలర్ట్ కొనసాగుతోంది. గోదావరి తీర ప్రాంతంపై ఖాకీలు దృష్టిసారించారు.

High alert: మావోయిస్టు వారోత్సవాలు... ఏజెన్సీలో హైఅలర్ట్

వరంగల్: మావోయిస్టు (Maoists) వారోత్సవాల నేపథ్యంలో ఏజెన్సీలో హైఅలర్ట్ కొనసాగుతోంది. గోదావరి తీర ప్రాంతంపై ఖాకీలు (Police) దృష్టిసారించారు. తెలంగాణ, ఛత్తీగఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించారు. ఏజెన్సీలోని ఆదివాసి గూడాలను జల్లెడ పడుతున్న పరిస్థితి నెలకొంది. ములుగు, భూపాలపల్లి జిల్లాల్లోని అటవీప్రాంతంలో భద్రతాబలగాల కూంబింగ్ నిర్వహించారు. మావోయిస్టు కీలక నేతలు భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో సంచరిస్తున్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయా గ్రామాల్లో పోలీసుల సమావేశాలు నిర్వహించారు. మావోయిస్టులకు సహకరిస్తే కఠిన చర్యలుంటాయని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. 

Read more