ఇకపై ఆర్టీసీ కార్గో లాజిస్టిక్స్‌: ఎండీ సజ్జనార్‌

ABN , First Publish Date - 2022-08-21T08:26:51+05:30 IST

టీఎ్‌సఆర్టీసీ వస్తు రవాణా సేవల కార్గో పేరును ‘ఆర్టీసీ లాజిస్టిక్స్‌’గా మార్చింది.

ఇకపై ఆర్టీసీ కార్గో లాజిస్టిక్స్‌: ఎండీ సజ్జనార్‌

 హైదరాబాద్‌, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): టీఎ్‌సఆర్టీసీ వస్తు రవాణా సేవల కార్గో పేరును ‘ఆర్టీసీ లాజిస్టిక్స్‌’గా మార్చింది. వినియోగదారులకు మరింత  మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో మరిన్ని చర్యలు చేపట్టామని ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ.సజ్జనార్‌ తెలిపారు. ఇప్పటి వరకు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల కే పరిమితమైన ఆర్టీసీ కార్గో (లాజిస్టిక్స్‌)హోం డెలవరీ సేవలను రాష్ట్ర వ్యాపితంగా అన్ని జిల్లాలకు విస్తరించనున్నట్టు పేర్కొన్నారు. 2020 జూన్‌ 19న ప్రారంభించిన ఆర్టీసీ వస్తు రవాణా సేవలు అనతి కాలంలోనే ప్రజల ఆదరణ చూరగొన్నట్టు తెలిపారు. ఆర్టీసీ 11 రీజియన్లు, 97 బస్‌ డిపోలతో లాజిస్టిక్స్‌కు  విస్తృత నెట్‌వర్క్‌ ఉన్నట్టు వివరించారు. మరిన్ని వివరాలకు  కార్గో లాజిస్టిక్‌ విభాగం అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ను మోబైల్‌  నెం.9154197752లో  సంప్రదించవచ్చని సూచించారు. 

Read more