నేడు భారీ వర్షాలు

ABN , First Publish Date - 2022-09-21T06:52:54+05:30 IST

రాష్ట్రంలో బుధవారం అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

నేడు భారీ వర్షాలు

ప్రాజెక్టులకు పెరిగిన ఇన్‌ఫ్లో 

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌) : రాష్ట్రంలో బుధవారం అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాగల మూడు రోజుల పాటు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోవైపు వాయువ్య దానికి అనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సోమవారం ఏర్పడిన  అల్పపీడనం వాయువ్య బంగాళాఖాతంలోని ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ తీరం వద్ద కొనసాగుతున్నట్లు తెలిపింది. మరోవైపు నైరుతి రుతుపవనాలు రాజస్థాన్‌, దానికి అనుకుని ఉన్న కచ్‌ ప్రాంతాల నుంచి మంగళవారం నిష్క్రమించాయని పేర్కొంది.  ఇక కృష్ణా, గోదావరి ప్రాజెక్టులకు వరద స్వల్పంగా పెరిగింది. నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు   2.86 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా, శ్రీశైలం ప్రాజెక్టుకు 2.71 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో చేరుతోంది.  ఇక, శ్రీరామసాగర్‌లోకి మంగళవారం 1,12,780 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరింది. దీంతో అధికారులు ప్రాజెక్టు 22 గేట్లు ఎత్తి.. 1,23,480 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. 

Read more