Heavy rains: మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్షాలు

ABN , First Publish Date - 2022-07-23T15:41:28+05:30 IST

మెదక్, సంగారెడ్డి జిల్లాలో అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి.

Heavy rains: మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్షాలు

మెదక్: మెదక్, సంగారెడ్డి జిల్లాలో అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో మెదక్ మండలంలో 26.8 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. శివ్వంపేట మండలంలో 21.4 సెంటిమీటర్లు, తుప్రాన్ మండలంలో 19.6 సెంటీమీటర్లు, చిన్న శంకరం పేటలో 19.4 సెంటీమీటర్లు, వెల్దుర్తి లో 17.3 సెంటీ మీటర్లు, నర్సాపూర్‌లో 17.2 సెంటి మీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. అటు సంగారెడ్డి జిల్లా జిన్నారంలో 21.4 సెంటీమీటర్లు, ఆందోల్‌లో 15.4 సెంటీమీటర్లు మేర వర్షపాతం నమోదు అయ్యింది. 


Updated Date - 2022-07-23T15:41:28+05:30 IST