అంబేడ్కర్‌ వర్సిటీలో హెచ్‌హెచ్‌సీఎం కోర్సు

ABN , First Publish Date - 2022-06-07T08:56:56+05:30 IST

అంబేడ్కర్‌ వర్సిటీలో హెచ్‌హెచ్‌సీఎం కోర్సు

అంబేడ్కర్‌ వర్సిటీలో హెచ్‌హెచ్‌సీఎం కోర్సు

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి): ఎంబీఏ హాస్పిటల్‌, హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్‌(హెచ్‌హెచ్‌సీఎం) కోర్సును అందించడానికి డా.బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం, 3 విద్యాసంస్థల మధ్య సోమవారం అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదిరింది. వర్కిటీ ఉపకులపతి ప్రొఫెసర్‌ కె.సీతారారావు సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. అపోలో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ కేర్‌ మేనేజ్‌మెంట్‌(ఏఐహెచ్‌సీఎం), కిమ్స్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ(కేఐఎంఎస్‌), దారుస్సలాం ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌(డీఈటీ)తో వర్సిటీ వేర్వేరుగా ఎంవోయూలు చేసుకుంది. రిజిస్ర్టార్‌ డా.ఏవీఎన్‌ రెడ్డి, ఆయా సంస్థల అధికారులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. 

Read more