ఆహారంపై జీఎస్టీ ప్రజలకు మోదీ గిఫ్ట్‌

ABN , First Publish Date - 2022-07-26T08:56:50+05:30 IST

స్వాతంత్య్రం రాకముందే ఆంగ్లేయులు ఉప్పుపై పన్ను విధిస్తే అప్పుడు ఉద్యమాలు జరిగాయని, ఇప్పుడు కేం ద్ర ప్రభుత్వం ఆహారంపై జీఎస్టీ విధించి నాటి బ్రిటిష్‌ పాలకులను గుర్తుకు తె స్తోందని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి దుయ్యబట్టారు.

ఆహారంపై జీఎస్టీ ప్రజలకు మోదీ గిఫ్ట్‌

మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా..ఆగస్టు 1 నుంచి దేశవ్యాప్తంగా ప్రచారోద్యమం: సీతారాం ఏచూరి 

హనుమకొండ క్రైం/యాదాద్రి, జూలై 25: స్వాతంత్య్రం రాకముందే ఆంగ్లేయులు ఉప్పుపై పన్ను విధిస్తే అప్పుడు ఉద్యమాలు జరిగాయని, ఇప్పుడు కేం ద్ర ప్రభుత్వం ఆహారంపై జీఎస్టీ విధించి నాటి బ్రిటిష్‌ పాలకులను గుర్తుకు తె స్తోందని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి దుయ్యబట్టారు. ఆహార పదార్థాలపై విధించిన జీఎస్టీ దేశ ప్రజలకు ప్రధాని మోదీ ఇచ్చిన గిఫ్ట్‌ అని ఎ ద్దేవా చేశారు. సీపీఎం 23వ రాష్ట్ర సమావేశాలు సోమవారం హనుమకొండ జి ల్లా కాజీపేటలో ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలకు సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు విజయరాఘవన్‌, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీనియర్‌ నాయకులు బీవీ రాఘవులు, జి. నాగయ్య, జూ లకంటి రాజిరెడ్డి, చెరుకుపల్లి సీతారాములు తదితరులు హాజరయ్యారు.  సీతారాం ఏచూరి మాట్లాడుతూ.. దేశంలో నాలుగు నెలలుగా మతోన్మాద ఘర్షణలు జరుగుతున్నాయని,పోలీసు, జ్యుడీషియరీ, ఇంటెలిజెన్స్‌, సీబీఐలను అడ్డం పెట్టుకుని అక్రమాలు బయటకు రాకుండా కప్పిపుచ్చుతున్నారని ఆరోపించా రు. మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా ఆగస్టు 1 నుంచి 15 వరకు దేశవ్యాప్తం గా ప్రచారోద్యమాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వార్తలు రాసిన జర్నలిస్టులపై హత్యలు, దాడులు జరుగుతున్నాయని, ఇంకా కొందరిపై అక్రమ కేసులు బనాయించి జైళ్లకు తరలిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ రాష్ట్రంలో దాడులు, మత ఘర్షణలు సృష్టిస్తోందని, ఆ పార్టీ విధానాలతో రానున్న రోజుల్లో ప్రజలు ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటారని తమ్మినేని వీరభద్రం అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సమస్యలు పట్టించుకోకపోవడంతో పాటు ప్రజల మధ్య కుల, మతాల చిచ్చు రేపుతున్నాయని ధ్వజమెత్తా రు. కడుపుకాలిన పేద ప్రజలు గుడిసెలు వేసుకుంటే పోలీసులు, రౌడీలతో దాడులు చేయించడం సిగ్గుచేటని ఆయన అన్నారు.  

Updated Date - 2022-07-26T08:56:50+05:30 IST