రైళ్ల పునరుద్ధరణకు గ్రీన్‌ సిగ్నల్‌

ABN , First Publish Date - 2022-07-05T12:51:41+05:30 IST

రైళ్ల పునరుద్ధరణకు దక్షిణ మధ్య రైల్వే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇటీవల రద్దు చేసిన 13 రైళ్లను పునరుద్ధరిస్తూ టైం టేబుల్‌ను ఖరారు

రైళ్ల పునరుద్ధరణకు గ్రీన్‌ సిగ్నల్‌

ఇక రోజూ నాందేడ్‌-పుణె ఎక్స్‌ప్రెస్‌  

హైదరాబాద్‌: రైళ్ల పునరుద్ధరణకు దక్షిణ మధ్య రైల్వే  గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇటీవల రద్దు చేసిన 13 రైళ్లను పునరుద్ధరిస్తూ టైం టేబుల్‌ను ఖరారు చేసింది. విజయవాడ-గూడూర్‌, గూడూర్‌-విజయవాడ, నిజామాబాద్‌-నాందేడ్‌, నాందేడ్‌-విజయవాడ, విజయవాడ-తెనాలి,  తెనాలి-విజయవాడ, కర్నూల్‌ సిటీ-నంద్యాల, నంద్యాల-కర్నూల్‌ సిటీ, గుంటూరు-విజయవాడ, విజయవాడ-గుంటూరు, విజయవాడ-ఒంగోలు,  ఒంగోలు-విజయవాడ మధ్యలో నడిచే రైళ్లను తిరిగిపునరుద్ధరించారు. వారంతపు రోజుల్లో నడిచే నాందేడ్‌-పుణె(నెంబరు17630), పుణె-నాందేడ్‌ (నెంబరు17629) ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను రోజూ నడపనున్నారు. నాందేడ్‌లో సాయంత్రం 15.55 బయలుదేరి మరుసటి రోజు ఉదయం.5.30 గంటలకు పుణె చేరుకుంటుంది. పుణెలో రాత్రి 21.35 బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.20 గంటలకు నాందేడ్‌కు చేరుకుంటుంది. 

Read more